- జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జటోత్ హుస్సేన్
బషీర్‌బాగ్, వెలుగు: ఎస్సీ, ఎస్టీలు సమాజంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా వివక్షకు గురి కావడం బాధాకరమని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జటోత్ హుస్సేన్ అన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమితులైన సందర్భంగా ఎస్‌బీఐ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన్ని ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని పర్వానా హల్లో జరిగిన కార్యక్రమంలో ఎస్‌బీఐ బ్యాంక్ సీజీఎం రాజేశ్‌కుమార్‌తో కలిసి జటోత్ హుస్సేన్ మాట్లాడారు. 33 ఏండ్ల తర్వాత తెలుగు బిడ్డకు ఎస్టీ కమిషన్ సభ్యుడి పదవి దక్కిందన్నారు. జాతి బాగు కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. కొంత మంది ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దాని వల్ల నిజమైన బాధితులు నష్టపోతున్నారన్నారు.